దేశ వ్యాప్తంగా నేడు కరోనా వ్యాక్సినేషన్

దేశవ్యాప్తంగా నేడు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంద.ి ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. తొలుత కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఈ [more]

Update: 2021-01-16 01:58 GMT

దేశవ్యాప్తంగా నేడు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంద.ి ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. తొలుత కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఈ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ చేరకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాక్సినేషన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలతో సంభాషించనున్నారు. ఈ వ్యాక్సినేషన్ ను గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

Tags:    

Similar News