రేపే ఉరి… అన్నీ అడ్డంకులు తొలిగినట్లే
రేపు నిర్భయ దోషులకు మరణ శిక్ష అమలు జరగబోతోంది. ఇప్పటి వరకూ ఉరి అమలుపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలని నిర్భయ [more]
రేపు నిర్భయ దోషులకు మరణ శిక్ష అమలు జరగబోతోంది. ఇప్పటి వరకూ ఉరి అమలుపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలని నిర్భయ [more]
రేపు నిర్భయ దోషులకు మరణ శిక్ష అమలు జరగబోతోంది. ఇప్పటి వరకూ ఉరి అమలుపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలని నిర్భయ దోషులు వేసుకున్న పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. స్టేను ఇచ్చేందుకు నిరాకరించింది. పవన్ గుప్తా వేసిన క్యురేటివ్ పిటీషన్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక మరోవైపు పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటీషన్ ను పెట్టుకున్నారు. నిర్భయ దోషులు ఇప్పటి వరకూ న్యాయపరంగా అడ్డుకుంటూ ఉరిశిక్షను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే అన్నీ అడ్డంకులు తొలిగిపోవడంతో రేపు ఉదయం ఆరు గంటలకు నలుగురు నిందితులను తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు.