డిసెంబర్ 31న మద్యం రికార్డ్స్ ఇవే..!
కొత్త సంవత్సర వేడుకల సంధర్భంగా మందుబాబులు మత్తులో ఊగిపోయి ఖజానాకు ఫుల్ కిక్కు ఇచ్చారు. ఆఖరి వారంలోనే అమ్మకాలు ఆరు వందల కోట్లపైనే మధ్యం అమ్మకాలు జరిగాయి. [more]
కొత్త సంవత్సర వేడుకల సంధర్భంగా మందుబాబులు మత్తులో ఊగిపోయి ఖజానాకు ఫుల్ కిక్కు ఇచ్చారు. ఆఖరి వారంలోనే అమ్మకాలు ఆరు వందల కోట్లపైనే మధ్యం అమ్మకాలు జరిగాయి. [more]
కొత్త సంవత్సర వేడుకల సంధర్భంగా మందుబాబులు మత్తులో ఊగిపోయి ఖజానాకు ఫుల్ కిక్కు ఇచ్చారు. ఆఖరి వారంలోనే అమ్మకాలు ఆరు వందల కోట్లపైనే మధ్యం అమ్మకాలు జరిగాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం వచ్చింది. తెలంగాణలో సాధారణంగా రోజుకు 50 నుండి 70 కోట్ల మధ్యం అమ్మకాలు జరుగుతాయి. న్యూ ఇయర్ స్వాగతం పలికే డిసెంబర్ 31కి మాత్రం ప్రతి ఏడాది అమ్మకాలు భారీ గా పెరుగుతాయి. ఎన్నడు లేని విధంగా ఈసారి మధ్యం బాబులు రాష్ట ఖజానాకు భారీ ఆదాయాన్ని సమకుర్చి పెట్టారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా చివరి వారంలో దాదాపు 600 కోట్లు పైన అమ్మాకాలు జరిగాయి. ఇక హైదరాబాద్ లోనే డిసెంబరు 31వ తేదీ ఒక్క రోజే సుమారు 70 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2017 డిసెంబరు 31న అమ్మకాలు రూ.60 కోట్లు మాత్రమే.
చివరి వారం మొత్తం
విపరీతంగా ఉన్న చలిని సైతం లెక్క చేయకుండా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే మద్యం సరఫరాకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాత్రి 12.30 గంటల సమయంలోనూ బార్లు కిటకిటలాడాయి. మందుబాబులు బార్లు, మద్యం దుకాణాల సమీపంలో రహదారులపై తూలుతూ కనిపించారు. న్యూ ఇయర్ వేడుకలలో ఒక్క రోజులోనే 133 కోట్ల మధ్యం అమ్మకాలు జరిగాయి. ఇక చివరి వారంలో డిసెంబర్ 26న 82 కోట్లు, డిసెంబర్ 27న 100కోట్లు, డిసెంబర్ 28న 106 కోట్లు, డిసెంబర్ 29న 132 కోట్లు, డిసెంబర్ 30న 83 కోట్లు, డిసెంబర్ 31 రోజు 133 కోట్ల వరకు మధ్యం అమ్మకాలు జరిగాయి. ఇక గత ఏడాది తో పోల్చితే ఈసారి ఎక్కువ జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది.