విమానంలో తాగుబోతు అమానవీయ చర్య

Update: 2018-09-01 07:22 GMT

ఎయిర్ ఇండియా విమానంలో తప్పతాగిన ఓ తాగుబోతు దారుణంగా ప్రవర్తించాడు. సోయి లేకుడా ఓ మహిళ ముందే ప్యాంటు విప్పి ఆమెపై మూత్రం పోసి అత్యంత అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనతో నిశ్చేష్టురాలైన సదరు మహిళ తన కూతురుకి గోడు వెల్లబోసుకుంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఏఐ102 విమానం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

ట్విట్టర్ వేదికగా నిలదీయడంతో...

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థకు ఫిర్యాదు చేసేందుకు సదరు మహిళ కూతురు ప్రయత్నించగా కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే, వెబ్ సైట్ లో ఫీడ్ బ్యాక్ ద్వారా ఫిర్యాదు చేయాలంటూ నిర్లక్ష్య సమాధానం వచ్చింది. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా ఎయిర్ ఇండియాపై విరుచుకుపడింది. ఈ ఘటనపై సాధ్యమైనంత త్వరలో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై స్పందించిన విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా... విచారణకు ఆదేశించారు. ఈ భయంకరమైన పరిస్థితికి సదరు మహిళ గురికావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

 

Similar News