కొడంగల్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. నిన్న నరేందర్ రెడ్డి బంధువు ఫాంహౌజ్ లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించగా రూ.51 లక్షలు లభ్యమయ్యాయి. ఈ డబ్బులపై వివరణ ఇవ్వాలని నరేందర్ రెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది. అయితే, డబ్బులు దొరికిన ఇంట్లోనే నరేందర్ రెడ్డి నాలుగు నెలలుగా ఉంటున్నారని, వాస్తవానికి 17 కోట్ల 51 లక్షలు దొరికితే ఐటీ అధికారులపై ఒత్తిడి తెచ్చి రూ.51 లక్షలు మాత్రమే చూపిస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.