మాట మార్చిన పీకే.. అందుకేనా?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన స్టేట్ మెంట్ ను వెనక్కు తీసుకున్నారు. రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయన్నారు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన స్టేట్ మెంట్ ను వెనక్కు తీసుకున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, కాంగ్రెస్ లేకుండా విపక్షాల ఐక్యత సాధ్యం కాదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. గాంధీ కుటుంబం అండ లేకపోయినా కాంగ్రెస్ మనుగడ సాధిస్తుందని తెలిపారు.
రాహుల్ పై...?
గతంలో ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలే లేవని చెప్పారు. కాంగ్రెస్ తో పనిలేకుండా విపక్షాలు కేంద్రంలో అధికారంలోకి వస్తాయని చెప్పారు. రాహుల్ గాంధీ భ్రమల్లో మునిగితేలుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వ్యాఖ్యలను సరిదిద్దుకున్నారు.