బ్రేకింగ్ : పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

టీఆర్ఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. స్పీకర్ ను కలసి తన [more]

Update: 2021-06-04 04:50 GMT

టీఆర్ఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. స్పీకర్ ను కలసి తన రాజీనామా లేఖను సమర్పిస్తానని ఆయన తెలిపారు. తనను కనీసం వివరణ కూడా కోరకుండా మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఉరి శిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక అడుగుతారన్నారు. కానీ తన విషయంలో రాత్రికి రాత్రి బర్త్ రఫ్ చేశారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా బర్త్ రఫ్ చేశారన్నారు. హుజూరాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నామన్నారు. తనను ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని ఆదేశాలిచ్చారని ఈటల రాజేందర్ తెలిపారు. 19 ఏళ్లుగా ఉన్న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఈటల రాజేందర్ ప్రకటించారు. కేసీఆర్ కుట్రలను, డబ్బులను, అణిచివేతలను నమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. తనది ఆత్మగౌరవ పోరాటమని ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News