లాక్ డౌన్ ఆలోచన మాకయితే లేదు
కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో కేంద్రం స్పందన సరిగా లేదని అన్నారు. రెమిడిసివర్ [more]
కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో కేంద్రం స్పందన సరిగా లేదని అన్నారు. రెమిడిసివర్ [more]
కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో కేంద్రం స్పందన సరిగా లేదని అన్నారు. రెమిడిసివర్ ధర మూడు వేలు ఉంటూ ముప్ఫయివేలకు విక్రయిస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో లాక్ డౌన్ ఆలోచన లేదని ఆయన చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ఈటల రాజేందర్ కోరారు. కేంద్రం కేటాయించే వ్యాక్సిన్ల సంఖ్యను బట్టే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉంటుందని చెప్పారు. 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే 3.50 కోట్ల డోసులు అవసరమని ఈటల రాజేందర్ తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను కేంద్రం నియంత్రించడం కాదని, రాష్ట్ర అవసరాలను తీర్చాలని ఈటల రాజేందర్ తెలిపారు.