కర్ఫ్యూ పెట్టే ఆలోచన ప్రస్తుతానికి లేదు

సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రధానంగా మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘాను పెంచినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల [more]

Update: 2021-02-23 02:15 GMT

సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రధానంగా మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘాను పెంచినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుందని ఈటల రాజేందర్ చెప్పారు. అయితే తెలంగాణలో కేసుల సంఖ్య పెరగడం లేదని, అందుకే ప్రస్తుతానికి కర్ఫ్యూ లాంటి ఆలోచన లేదని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు మాత్రం కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Tags:    

Similar News