ఎట్టకేలకు చిరుత చిక్కింది
మూడు నెలలపాటు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకోగలిగారు. ప్రజలతోపాటు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతను చివరికి రాజేంద్రనగర్ లోని అదే [more]
మూడు నెలలపాటు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకోగలిగారు. ప్రజలతోపాటు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతను చివరికి రాజేంద్రనగర్ లోని అదే [more]
మూడు నెలలపాటు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకోగలిగారు. ప్రజలతోపాటు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతను చివరికి రాజేంద్రనగర్ లోని అదే ప్రాంతాల్లో పట్టుకోగలిగారు. మూడు నెలల క్రితం గగన్ పహాడ్ ప్రధాన రోడ్డుపైన చిరుత ప్రత్యక్షమైంది. చిరుతను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నం చేశారు నడిరోడ్డు మీద చిరుత నానా హంగామా సృష్టించింది అక్కడ ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ పైన దాడి చేసి అక్కడి నుంచి పారిపోయింది. అప్పటి నుండి చిరుతను పట్టుకోవడానికి అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటి కప్పుడు చిరుత కోసం మేకలను ఎరగా వేసి పట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా చిరుత కనబడిన చోటల్లా సీసీ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు పెట్టి ఎప్పటి కప్పుడు పర్యవేక్షించారు. అయినా చిరుత జాడ దొరకలేదు.
ఆవులను ఎరగా వేసి…..
పలుమార్లు శివారు ప్రాంతంలోని గ్రామాల్లో కట్టి వేసిన ఆవులపైన దాడి చేసి చిరుత చంపేసింది. రాజేంద్రనగర్ వాలంతరీ, అప్పా తదితర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా నివసించారు. గత మూడు నెలల నుంచి కూడా చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఎప్పటికప్పుడు బోను లను మారుస్తూ, మాంసాన్ని ఎరగా వేస్తూ వున్నారు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా చిరుత బోనులో చిక్కలేదు. అయితే నిన్న రాజేంద్ర నగరంలోని వాలంటరీ శివారు ప్రాంతాల్లో ఉన్న ఒక ఇంటిలో కొట్టివేసిన ఆవును చిరుత చంపి తినేసింది. చిరుత ఇదే ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు రూడీ చేసుకున్నారు. దీంతో ఆవులను ఎరగా వేసి బోన్ లను ఏర్పాటు చేశారు. చివరకు ఇవాళ ఉదయం తెల్లవారుజామున చిరుతను అధికారులు పట్టుకోగలిగారు.