అమరావతి ఇక అంధకారమే?

జీఎన్ రావు కమిటీ సిఫార్సులు చూస్తుంటే అమరావతి ఇక లేనట్లే కన్పిస్తుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో కొన్ని జోన్లు వరద ముంపునకు గురయ్యే అవకాశముండటంతో అక్కడ నిర్మాణాలు [more]

Update: 2019-12-20 12:44 GMT

జీఎన్ రావు కమిటీ సిఫార్సులు చూస్తుంటే అమరావతి ఇక లేనట్లే కన్పిస్తుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో కొన్ని జోన్లు వరద ముంపునకు గురయ్యే అవకాశముండటంతో అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని కూడా కమిటీ సూచించింది. పర్యావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ సిఫార్సులు చేసింది. జీఎన్ రావు కమిటీ సిఫార్సుల మేరకు అమరావతిలో అసెంబ్లీ మాత్రమే ఉండనుంది. దీంతో పాటు స్టాఫ్ క్వార్టర్స్, ఎమ్మెల్యే, మంత్రుల క్వార్టర్లు ఉంటాయి. దీనికి తోడుగా హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. రాజ్ భవన్ ను కూడా అమరావతిలో నిర్మించాలని సూచించింది. ఏడాదికి అరవై రోజులు పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల ఖర్చు ఆర్థిక భారం కాబోదని కమిటీ అభిప్రాయపడింది. వికేంద్రీకరణకే కమిటీ మొగ్గు చూపడంతో ఈ సిఫార్సులు అమలయితే అమరావతి ఇక లేనట్లేనన్నది స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News