బ్రేకింగ్ : ఏపీ లో బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ ల నియామకం

ఆంధ్రప్రదేశ్ లో 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంత్రులు బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ల వివరాలు తెలియజేశారు. మొత్తం 56 మంది ఛైర్మన్లు, [more]

;

Update: 2020-10-18 06:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంత్రులు బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ల వివరాలు తెలియజేశారు. మొత్తం 56 మంది ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించారు. ఛైర్మన్, డైరెక్టర్ల నియామకాల్లో అన్ని జిల్లాలకు ప్రాతనిధ్యం కల్పించారు. కొన్నిరోజులుగా కసరత్తులుచేసిన ప్రభుత్వం నియామకాలను పూర్తిచేసింది. ఈ నియామకాల్లో యాభై శాతం మహిళలకు రిజర్వ్ చేసింది. ఇందులో కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ గా పేరాడ తిలక్ ను నియమించారు. గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడుపై ఓటమి పాలయిన పేరాడ తిలక్ కు కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించింది.

Tags:    

Similar News