ఏపీ అప్పుల పరిస్థితి ఇదీ.. తేల్చి చెప్పిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో అప్పుల భారం పెరిగిందన్నారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం కూడా మరో కారణమని [more]
;
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో అప్పుల భారం పెరిగిందన్నారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం కూడా మరో కారణమని [more]
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో అప్పుల భారం పెరిగిందన్నారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం కూడా మరో కారణమని పేర్కొంది. ఇక ఆదాయం భారీగా పడిపోయిన కరోనా సమయంలోనూ ఖర్చు ఎక్కువగా పెట్టామని తెలిపింది. 2014 -2019 కాలంలో అప్పులు తారాస్థాయికి చేరుకున్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వమే గతంలో ఎన్నడూ లేని విధంగా 18,48,655 కోట్ల అప్పు చేసిందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది. గత ప్రభుత్వ విధానాల వల్లనే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది ఏర్పడిందని ప్రభుత్వం పేర్కొంది.