డేట్ ఫిక్స్ చేశారు.. కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వకపోయినా?
ఆంధ్రప్రదేశ్ లో దశల వారీగా అన్నీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ప్రభుత్వ పాఠశాలలను కూడా ఆగస్టు 3నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 22వ తేదీ నుంచి ఏపీలో [more]
;
ఆంధ్రప్రదేశ్ లో దశల వారీగా అన్నీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ప్రభుత్వ పాఠశాలలను కూడా ఆగస్టు 3నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 22వ తేదీ నుంచి ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో దశల వారీగా అన్నీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ప్రభుత్వ పాఠశాలలను కూడా ఆగస్టు 3నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 22వ తేదీ నుంచి ఏపీలో పాఠశాలలు మూతబడ్డాయి. పదో తరగతి పరీక్షలను కూడా కరోనా కారణంగా వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. అయితే ఆగస్టు నాటికి కరోనా కంట్రోల్ లోకి వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది.