చంద్రబాబు బంట్రోతుల సవాల్ కు స్పందించాలా?
విశాఖ నుంచి త్వరలోనే పాలన ప్రారంభమవుతుందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం ఖాయమని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై [more]
;
విశాఖ నుంచి త్వరలోనే పాలన ప్రారంభమవుతుందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం ఖాయమని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై [more]
విశాఖ నుంచి త్వరలోనే పాలన ప్రారంభమవుతుందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం ఖాయమని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నిన్న టీడీపీ నేతలు పెట్టిన సమావేశంపై ఆయన వ్యంగాస్త్రాలు విసిరారు. అది టీడీపీ భజన మండలి సమావేశమని గుడివాడ అమర్ నాధ్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారా? లేదా? అన్నది టీడీపీ చెప్పాలని ఆయన నిలదీశారు. చంద్రబాబు బంట్రోతుల సవాల్ కు తాము స్పందించాల్సిన అవసరం లేదని గుడివాడ అమర్ నాధ్ అన్నారు.