ఆజాద్ అలా అనేశారేంటి?

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రశంసలు కురిపించారు. మోదీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి అని ఆజాద్ కొనియాడారు. [more]

Update: 2021-03-01 01:11 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రశంసలు కురిపించారు. మోదీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి అని ఆజాద్ కొనియాడారు. తాను టీ అమ్ముకున్న వ్యక్తిగా చెప్పుకునేందుకు మోదీ వెనకాడరన్నారు. ప్రధాని గా అయినా మోదీ తన తొలి ప్రస్థానాన్ని మరవలేదన్నారు. ఆదివారం జమ్మూలో ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపైన అసంతృప్తితోనే ఆజాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. మోదీ కూడా గతంలో ఆజాద్ పదవి కాలం పూర్తవుతున్న సందర్భంగా రాజ్యసభ లో ప్రసంగిస్తూ కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆజాద్ వ్యాఖ్యలు ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారాయి.

Tags:    

Similar News