ఆజాద్ వ్యాఖ్యలతో…?
కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారుఅజిత్ దోవల్ నిన్న జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పౌరుడిలో పర్యటించిన [more]
కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారుఅజిత్ దోవల్ నిన్న జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పౌరుడిలో పర్యటించిన [more]
కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారుఅజిత్ దోవల్ నిన్న జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పౌరుడిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానికులతో కలసి ఆరు బయటే భోంచేశారు కూడా. దీనిపై స్పందించిన గులాం నబీ ఆజాద్ డబ్బులతో ఎవరినైనా తీసుకురావచ్చని, ఎవరితోనైనా భోజనం చేయవచ్చని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఆజాద్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. పాకిస్థాన్ తరహాలోనే ఆజాద్ వ్యాఖ్యలున్నాయని, వెంటనే ఆజాద్ జాతికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాగా కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆజాద్ ను శ్రీనగర్ ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు.