ఎన్ని కరోనా పరీక్షలు చేశారు..? ప్రశ్నించిన హైకోర్టు

మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించ వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఆస్పత్రిలో చనిపోయిన వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు [more]

;

Update: 2020-05-26 14:24 GMT

మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించ వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఆస్పత్రిలో చనిపోయిన వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. .మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదంటూ గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన ఇవాళ హైకోర్టులో విచారణ సాగింది. అయితే ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు కొట్టివేస్తూ ఆసుపత్రిలో చనిపోయిన వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అంతేకాకుండా కరోనా పై ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా కరోనా పరీక్షలను విరివిగా ఎందుకు చేయడం లేదు అంటూ ప్రశ్నించింది. దీంతోపాటుగా మార్చి 11 నుంచి ఇప్పటివరకు ఎంతమందికి పరీక్షలు చేశారో సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది.

Tags:    

Similar News