కుట్ర దారులెవరో తేల్చేస్తాం

న్యాయమూర్తులపై సోషల్ మీడియాల దుష్ప్రచారం చేయడం కుట్రలో భాగమేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారో తేలుస్తామని చెప్పింది. ఎవరి ప్రభావం లేకుండా న్యాయమూర్తులను [more]

Update: 2020-10-02 02:08 GMT

న్యాయమూర్తులపై సోషల్ మీడియాల దుష్ప్రచారం చేయడం కుట్రలో భాగమేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారో తేలుస్తామని చెప్పింది. ఎవరి ప్రభావం లేకుండా న్యాయమూర్తులను దూషించబోరని పేర్కొంది. న్యాయవ్యవస్థపై నమ్మకం లేకుంటే పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూసివేయాలని కోరడం మంచిదని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రం చట్టబద్ధంగా పాలన అమలు కాకపోతే తాము అధికారాన్ని ఉపయోగిస్తామని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ బలహీనమైతే సివిల్ వార్ కు దారితీస్తుందని పేర్కొంది. వ్యవస్థలను అందరం కలసి కాపాడుకోవాలని కటువు వ్యాఖ్యలు చేసింది.

Tags:    

Similar News