తనపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర ధర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వై.ఎస్. పిటీషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఈ కేసును విచారించిన సిట్ నివేదికను కోర్టుకు అందజేశారు. అయితే, సీపీటీవీ పుటేజ్ ను సమర్పించాలని కోర్టు చెప్పగా... మూడు నెలలుగా అక్కడ సీసీటీవీ పుటేజ్ లేదని సమాధానం ఇచ్చారు. ఎయిర్ పోర్టులో సీసీటీవీ పుటేజ్ లేదని చెప్పడం పట్ల హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక్కడి సీసీటీవీ పుటేజ్ ఎవరి ఆధీనంలో ఉంటుందని కోర్టు ప్రశ్నించినా సిట్ చెప్పలేకపోయింది. అయితే, ఎయిర్ పోర్టులో భద్రతాలోపాలు క్షమించరానివని కోర్టు వ్యాఖ్యానించింది. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.