జగన్ ఉత్తర్వులు కొట్టివేత

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని [more]

;

Update: 2020-03-02 11:15 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పు పట్టింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. సుప్రీంకోర్టు యాభైశాతానికి పైగా రిజర్వేషన్లు చెల్లవని గతంలో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. నెలలోపు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరో నెల రోజుల పాటు వాయిదా పడినట్లే.

Tags:    

Similar News