హనీ ట్రాప్… అడ్డంగా బుక్కయి

అందమే ఆమెకు పెట్టుబడి అయింది. ఈ అందాన్ని ఎరగా వేసి వ్యాపారవేత్తలను హనీ ట్రాప్ చేసి డబ్బులు దండుకుంటోంది. ఎయిర్ హోస్టెస్ గా పనిచేసి చివరకు ఛీటర్ [more]

Update: 2019-10-31 07:56 GMT

అందమే ఆమెకు పెట్టుబడి అయింది. ఈ అందాన్ని ఎరగా వేసి వ్యాపారవేత్తలను హనీ ట్రాప్ చేసి డబ్బులు దండుకుంటోంది. ఎయిర్ హోస్టెస్ గా పనిచేసి చివరకు ఛీటర్ గా మారిన ఈ లేడీ ఉదంతమిది. భర్తతో కలిసి బడా పారిశ్రామికవేత్తలు ఎన్నారైలను మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. హైదరాబాద్ మొయినాబాద్ పోలీసులు కనిష్క తో పాటు విజయ్ కుమార్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

అందాన్ని అడ్డం పెట్టుకుని…

బారెడు కళ్లు… లేలేతబుగ్గలు.. చక్కటి ముఖ సౌందర్యం… చూడగానే కట్టిపడేసే అందం.. ఆమెకు ఓ వరంలా మారాయి. ఆ అందాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించాలనుకుంది. ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తూనే గాలిలో మేడలు కట్టేసింది. దానికి పూనాదిలా భర్త సహాకారం అందడంతో కట్టుకున్న కలల మేడలు..నిజమైపోతాయనుకుంది. బట్… చివరి క్షణాల్లో కథ అడ్డం తిరిగే సరికి ఆమె వేసిన స్కెచ్ కి స్టార్టింగ్ లోనే శుభం కార్డు వేయాల్సి వచ్చింది.

విలాసవంతమైన జీవితం కోసం…

నగరానికి చెందిన కనిష్క విమానాశ్రయంలో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తోంది. ఏడాది కిందట వివాహం కూడా అయ్యింది. అటు ఆమె సంపాదన, ఇటు భర్త జీతభత్యాలతో హాయిగా కాలం గడిచిపోతోంది. విలాసవంతమైన జీవితం గడపాలనుకున్న వారికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా వచ్చాయి. వాటిని తొలగించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న క్రమంలో ఆమె మైండ్ లో ఓ మెరుపు లాంటి ఐడియా వచ్చింది. భర్త సైతం సై అనే సరికి ఇంకేముంది హానీ ట్రాప్ మొదలు పెట్టింది. ఆమె అందచందాలు చూసి ఓ వ్యాపారవేత్త మనసు పారేసుకున్నాడు.

ఎర్రగా…బుర్రగా ఉందని….

అంతే ఆపరేషన్ స్టార్ అయ్యింది. వ్యాపారవేత్తతో గడిపిన క్షణాలు అతడికి తెలియకుండానే సెల్ లో రికార్డు చేసింది. ఆ తరువాత భర్తతో కలిసి బెదిరించడం మొదలు పెట్టింది. తన వద్ద ఉన్న వీడియోస్, డమ్మీ గన్ తో బెదిరించి ఇరవై లక్షలు నొక్కేసింది. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బు కావాలనే సరికి చివరికి ఆ వ్యాపారి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హానీ ట్రాప్ స్టయిల్ లో మరో కస్టమర్ లా వెళ్లారు. డ్రామా చేస్తున్నారన్న విషయం తెలియక పోలీసులు వేసిన వలలో ఆ దంపతులు ఇద్దరు చిక్కారు. దీంతో హానీ ట్రాప్ సినిమాకి స్టార్టింగ్ లోనే శుభం కార్డు వేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అమ్మాయి ఎర్రగా, బుర్రగా ఉందని పరుగులు పెడితే ఇదిగో ఇలాంటి లేడీ కిలాడీల చేతుల్లో క్షవరం ఖాయం.. తస్మాత్ జాగ్రత్త.

Tags:    

Similar News