వచ్చేనెలే హుజూర్ నగర్ ఉప ఎన్నిక

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్‌ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా ప్రకటించారు. మహారాష్ట్ర, [more]

Update: 2019-09-21 07:48 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్‌ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా ప్రకటించారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన సందర్భంగా సునీల్‌ ఆరోరా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉప ఎన్నికకు సెప్టెంబర్‌ 23న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. ఉపసంహరణ అక్టోబర్ 3. ఇక పోలింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 21న, ఓట్ల లెక్కింపు 24న నిర్వహించనున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి గెలవడంతో అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుుడు మళ్లీ ఉప ఎన్నిక జరుగనుంది.

 

Tags:    

Similar News