శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్

శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు షాకిచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 [more]

Update: 2020-04-18 01:41 GMT

శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు షాకిచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు నోటిసులు జారీ చేసింది. ఈ 68 కాలేజీలలో శ్రీచైతన్యకు సంబంధించినవి 18, నారాయణవి 26 కళాశాలలు ఉన్నాయి. సదరు కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది.

నిబంధనలను పాటించని

గతంలో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలో అక్రమాలపై విచారణ చేపట్టి గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలని సామాజిక కార్యకర్త రాజేశ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టి రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలల వివరాలపై నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డును సూచించింది. అయితే మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్ధులపై ప్రభావం పడుతుందని, అందుకే పరీక్షలు ముగిసిన తర్వాత గుర్తింపు లేని, నిబంధనలు పాటించిన కాలేజీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. వాదోపవాదనలు విన్న హైకోర్టు ఎన్‌ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు తాజాగా నిబంధనలు పాటించని కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.

Tags:    

Similar News