వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శనివారం 251వ రోజుకు చేరుకుంది. విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం సాయంత్రం చోడవరంలో జరిగిన భార్ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలోని అన్ని చెక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. స్కూల్, కాలేజీల ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను తెరిపించి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని, చంద్రబాబు దళారి మాదిరిగా రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు పంటను కొనుగోలు చేసి తన హెరిటేజ్ షోరూంలలో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నాడన్నారు. మంత్రి యనమల పన్నుకి చికిత్స కోసం సింగపూర్ వేళ్లారని, అదే పేదవాడు హైదరాబాద్ లో చికిత్స చేయించుకుంటే ఆరోగ్య శ్రీ ఇవ్వకపోవడం దారుణమన్నారు.