జగన్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు

జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. ప్రభుత్వం తరుపున న్యాయవాదుల అభ్యర్ధనను తోసిపుచ్చింది.

Update: 2021-11-15 05:48 GMT

జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. ప్రభుత్వం తరుపున న్యాయవాదుల అభ్యర్ధనను ధర్మాసనం తోసిపుచ్చింది. అమరావతి రాజధాని కేసులో విచారణకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం ఏర్పాటయింది. నేటి నుంచి ఈ ధర్మాసనం సీఆర్డీఏ రద్దు, రాజధాని తరలింపుపై దాఖలయిన పిటీషన్లను విచారించనుంది. విచారణ ప్రారంభమయిన వెంటనే ప్రభుత్వం తరుపున న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.

ఇద్దరినీ తొలగించాలని....
ధర్మాసనంలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులను విచారణ నుంచి తొలగించాలని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు కోరారు. వారికి అమరావతిలో భూములున్నందున వారిని విచారణను తప్పించాలని కోరారు. అయితే ప్రభుత్వం తరుపున న్యాయవాదుల పిటీషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. అలా అయితే వేరే రాష్ట్రంలో విచారణ చేపట్టాలని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. రాజధాని కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేస్తామని చీఫ్ జస్టిస్ తెలిపారు


Tags:    

Similar News