బ్రేకింగ్ : జక్కంపూడి రాజాకు జగన్…?

కాపు కార్పేషన్ ఛైర్మన్ గా జక్కంపూడి రాజా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జక్కంపూడి రాజా ఇటీవల రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ [more]

;

Update: 2019-07-19 12:35 GMT

కాపు కార్పేషన్ ఛైర్మన్ గా జక్కంపూడి రాజా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జక్కంపూడి రాజా ఇటీవల రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. జక్కంపూడి రాజాకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే సీనియారిటీ కారణంగా జక్కంపూడి రాజాకు మంత్రి పదవి దక్కలేదు. జక్కంపూడి కుటుంబంపై వైఎస్ కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సయితం జక్కంపూడి రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ను తన కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారు. జగన్ వెంటే జక్కంపూడి కుటుంబం తొమ్మిదేళ్లుగా నడిచింది. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా జక్కంపూడి రాజా నియమించి జగన్ తన ఆప్యాయతను ఆ కుటుంబంపై చాటుకున్నారు.

Tags:    

Similar News