పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఆయన స్పందించారు.;

Update: 2022-06-04 14:44 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఆయన స్పందించారు. బీజేపీతో తమ పార్టీ బంధం గట్టిగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను ఇటీవల జాతీయ నేతలతో చర్చించానని, మరి కొంత క్లారిటీ రావాలని పవన్ కల్యాణ్ తెలిపారు. గతంలో వార్ వన్ సైడ్ లవ్ అని అన్న చంద్రబాబు ఇప్పుడు వార్ వన్ సైడ్ అని అంటున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తాను చాలా సార్లు తగ్గానని, రాష్ట్రం కోసం ఈసారి మిగిలిన వాళ్లు తగ్గాలని, తగ్గితేనే బాగుంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.

1. జనసేన - బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం
2. జనసేన -టీడీపీ - బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం
2. జనసేన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
ఈ మూడు ఆప్షన్లు తమ ముందు ఉన్నాయన్నారు. పవన్ కల్యాణ‌్ తన మాటల్లో తగ్గేది లేదని, మిగిలిన వాళ్లు తగ్గాలని పరోక్షంగా టీడీపీకి సంకేతాలు ఇచ్చారు. ఈసారి పొత్తులు కుదిరితే అది టీడీపీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.


Tags:    

Similar News