ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్.. స్టార్టప్ కంపెనీకి కితాబు

ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ విషయంలో తెలంగాణ గమ్యస్థానంగా మారుతుందని జయేష్ రంజన్ అభిప్రాయపడ్డారు

Update: 2021-12-09 15:25 GMT

ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ విషయంలో తెలంగాణ గమ్యస్థానంగా మారుతుందని ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అభిప్రాయపడ్డారు.ఎర్మిన్ ఆటోమోటివ్ తయారు చేసిన సైకిళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ యువత స్టార్టప్ కంపెనీని స్థాపించి ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేయడం సంతోషించదగ్గ పరిణామమని జయేష్ రంజన్ అన్నారు.

సంపూర్ణమైన భద్రత...
వినియోగదారులకుఎర్మిన్ ఆటోమోటివ్ 
సంపూర్ణమైన నమ్మకం తోపాటు అనుభవాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సైకిల్ రైడర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. యువకులు తమ కలను సాకారం చేసుకుని అనూహ్యమైన విజయాన్ని సాధించారన్నారు. ఈ సైకిల్ లో భద్రత, పనితీరు భేషుగ్గా ఉందని జయేష్ రంజన్ కితాబిచ్చారు. ఇటువంటి సైకిళ్లను రూపొందించడం నగర యువకులు సాధించిన విజయంగా జయేష్ రంజన్ అభివర్ణించారు.
చిన్న వయసులోనే...
ఇప్పుడు భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వాహనాలదేనని ఆయన అన్నారు. ఐకియా నుంచి ఇతర వాణిజ్యసంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికే ఇష్టపడుతున్నాయని జయేష్ రంజన్ గుర్తు చేశారు. టెస్లాకు పోటీ దారుగా ఉన్న ట్రిటాన్ కంపెనీ జహీరాబాద్ లో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. స్టార్టప్ వ్యవస్థాపకులు శశాంక్, ఆదిత్య చిన్న వయసులోనే విజయం సాధించారని అన్నారు. ఎర్మిన్ ఆటోమోటివ్ సైకిళ్ల ధర అరవై వేల నుంచి 75 వేల వరకూ ఉంటుంది. ఆసక్తిగల వారు www.erminautomotive.com నమోదు చేసుకోవచ్చు.


Tags:    

Similar News