రాజీనామాకు సిద్ధమన్న వైసీపీ ఎమ్మెల్యే

తాను బెదిరింపులకు పాల్పడ్డానని రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా [more]

;

Update: 2021-02-04 01:49 GMT

తాను బెదిరింపులకు పాల్పడ్డానని రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తాను ఎవరినీ బెదిరించలేదనిచెప్పారు. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ఆయన తెలిపారు. గతంలో తాను మాట్లాడిన మాటల ఆడియో టేపులు ఇప్పుడు బయటపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నిక జరిగితే గ్రామం అభివృద్ధి చెందుతుందని మాత్రమే తాను సూచించానన్నారు. తనపై ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.

Tags:    

Similar News