వారిని ఉద్యోగం నుంచి తొలగించండి.. కేసీఆర్ సీరియస్

మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ వ్యవస్థలో ఇలాంటి ఘటనలు జరగడం [more]

Update: 2021-06-25 13:32 GMT

మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ వ్యవస్థలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. మరియమ్మ లాకప్ డెత్ పై విచారణ చేపట్టాలని ఆదేశించారు. మరియమ్మ కుమారుడు ఉదయ కిరణ్ కు పదిహేను లక్షల ఎక్స్ గ్రేషియో, పక్కా ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. మరియమ్మ ఇద్దరు కూతుళ్లకు పది లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు. లాకప్ డెత్ కు బాధ్యులైన వారిని అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని కేసీఆర్ ఆదేశించారు.

Tags:    

Similar News