అడ్డుకోవాల్సిందే

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న ఏపీ వైఖరిని ఎండగట్టాలన్నారు. రాయలసీమ [more]

Update: 2021-07-07 03:15 GMT

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న ఏపీ వైఖరిని ఎండగట్టాలన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు లేవని, అయినా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ తొందరపడుతుందని కేసీఆర్ అన్నారు. దానికి పర్యావరణ అనుమతులు వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్లమెంటు సమావేశాల్లో సయితం ఈ అంశంపై నిలదీయాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ వాణిని విన్పించేందుకు అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేసీఆర్ అన్నారు.

Tags:    

Similar News