ముందస్తు ఎన్నికల వస్తాయని అంచనాలు ఉన్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం విద్యుత్ ఉద్యోగులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వారికి భారీగా వరాలు ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ ప్రకటించారు. 27 శాతం నుంచి 32 శాతం వరకు ఇవ్వాలని అధికారులు చెప్పారని, ప్రభుత్వం ఇంకా పెద్ద మనస్సు చేసుకుని 35 శాతం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వోద్యోగులతో సమానంగా విద్యుత్ ఉద్యోగులకు హెల్త్ స్కీం, ఇతర సదుపాయాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వృద్ధిరేటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, తెలంగాణకు దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం లేదన్నారు.