అమిత్ షా తో భేటీ అయిన కేసీఆర్

నీళ్లు, నిధుల అంశాలే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు [more]

Update: 2019-10-04 11:17 GMT

నీళ్లు, నిధుల అంశాలే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌తో కలసి సంయుక్తంగా నిర్మించతలపెట్టిన కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించినట్లు భేటీ అనంతరం కేసీఆర్ తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు హోదా తమకు ఎప్పటికీ ప్రాధాన్య అంశమేనని కేసీఆర్ చెప్పారు.

 

Tags:    

Similar News