కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి

దేవాదయ శాఖ పనితీరుపై ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి [more]

Update: 2019-01-31 07:40 GMT

దేవాదయ శాఖ పనితీరుపై ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇవాళ భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, టీటీడీ అధికారులు హాజరయ్యారు. అయితే, దేవాదయ శాఖ మంత్రి అయిన కేఈ కృష్ణమూర్తికి మాత్రం టీటీడీ అధికారులు ఆహ్వానం పంపించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. టీటీడీలో కొందరు అధికారులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, రెవెన్యూ శాఖ కంటే దేవాదయ శాఖ కష్టంగా తయారైందన్నారు. దేవాదయ శాఖలో ఉన్న సమస్యలు ఎక్కడా లేవని, ఒక్కోసారి ఈ శాఖను వదులుకుంటే బాగుండనిపిస్తోందని పేర్కొన్నారు.

Tags:    

Similar News