నన్ను క్షోభ పెట్టవద్దు
తాను 37 ఏళ్లుగా నిబద్ధతతో కూడుకున్న రాజకీయాలు చేశానని, తనను క్షోభ పెట్టవద్దని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపులో తన [more]
తాను 37 ఏళ్లుగా నిబద్ధతతో కూడుకున్న రాజకీయాలు చేశానని, తనను క్షోభ పెట్టవద్దని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపులో తన [more]
తాను 37 ఏళ్లుగా నిబద్ధతతో కూడుకున్న రాజకీయాలు చేశానని, తనను క్షోభ పెట్టవద్దని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపులో తన తప్పులేదన్నారు కోడెల. హైదరాబాద్ నుంచి ఫర్నీచర్ ను తీసుకొచ్చేటప్పుడు అసెంబ్లీ అధికారులే తన క్యాంపు కార్యాలయానికి పాత ఫర్నీచర్ ను చేర్చారని చెప్పారు. తన పదవి పూర్తయిన వెంటనే ఫర్నీచర్ ను తీసుకెళ్లమని జూన్ 7వ తేదీన లేఖ రాశానని, అయినా స్పందించకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోడెల చెప్పారు. తన కార్యాలయం నుంచి ఇప్పటికే ఫర్నీచర్ ను తీసుకెళ్లారని ఆయన వివరించారు.