కాంగ్రెస్ నియమించిన కమిటీలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తులు బయటపడుతున్నాయి. కమిటీల మీద ఇప్పటికే వీహెచ్ అసంతృప్తిని వెళ్లగక్కని సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమిటీల నియామకం వ్యతిరేకించారు. బ్రోకర్లందరీకి కమిటీలో స్థానం కల్పించారని ఆరోపించారు. తెలంగాణకు కుంతియా శనిలా తయారయ్యారన్నారు. తాను ఎవరికీ భయపడనని, పైరవీకారులకు టిక్కెట్లు ఇస్తే అధికారంలోకి రాదన్నారు. గాంధీ భవన్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెడితే పవర్ లోకి రాలేమన్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని, ప్రజామోదం నేతలకే టిక్కెట్లు ఇవ్ాలన్నారు. తాను ఎవరకీ భయపడనన్నారు. తాము ప్రజల్లోనే ఉంటామని, ప్రజలకోసమే బతుకుతామని చెప్పారు. రెండుస్నర సంవత్సరాల నుంచి తనను కాంగ్రెస్ పార్టీ అవమానపర్చిందన్నారు. అయినా సహంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని చెప్పారు.