ఢిల్లీకి కోమటిరెడ్డి… ఫైనల్ అయిందని తెలిసి?

తెలంగాణ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయిందన్న వార్తలతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే [more]

;

Update: 2020-12-22 04:23 GMT

తెలంగాణ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయిందన్న వార్తలతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ అందరి అభిప్రాయాలను సేకరించి హైకమాండ్ కు నివేదిక అందించారు. త్వరలోనే పీసీసీ చీఫ్ పేరును హైకమాండ్ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News