అలరించిన లహరి కూచిపూడి నృత్యం
జార్జియా రాష్ట్రం అట్లాంటాలోని లహరి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అనేక మందని ఆకట్టుకుంది.
కూచిపూడి నృత్యం ఖండాంతరాలకు వ్యాపించింది. ప్రవాస భారతీయులు కొందరు కూచిపూడిని విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నారు. కూచిపూడి నృత్యం భారతీయ సంస్కృతిలో భాగం. అమెరికాలో స్థిరపడిన అనేక మంది భారతీయులు తమ పిల్లలకు కూచిపూడి నృత్యాన్ని నేర్పుతున్నారు. తాజాగా జార్జియా రాష్ట్రం అట్లాంటాలోని లహరి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అనేక మందని ఆకట్టుకుంది. పలువురి ప్రశంసలు అందుకుంది.
ఎనిమిదో ఏట నుంచే...
లహరి 17 ఏళ్ల వయసులో కూచిపూడి అరంగ్రేటం చేసింది. ఎనిమిదో ఏట నుంచి కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్న లహరి అందులో పూర్తిస్థాయి పట్టు సాధించింది. అరంగేట్రం చేసింది. కూచికూడి నృత్యంలోని వంద రకాల పాదముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్తముద్రలు, కళ్ల కదలికలను ప్రదర్శించి అందరినీ అలరించింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలయిన లహరి నాట్యం నాలుగు గంటల పాటు సాగింది.
నల్లగొండ నుంచి వెళ్లి....
లహరి తల్లిదండ్రులు వేణుకుమార్ రెడ్డి పిసెకె, వాసవిలు 25 ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ వేణుకుమార్ రెడ్డి పలువ సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్నారు. వేణుకుమార్ రెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లాలోని అల్వాల గ్రామం. ఇరవై ఐదేళ్ల క్రితం వెళ్లి అక్కడ స్థిరపడిన వేణుగోపాల్ రెడ్డి అక్కడ అంతర్జాతీయ క్రికెట్ మండలి అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అమెరికాలో స్థిరపడి ఉన్నతస్థాయికి చేరుకున్నా భారతీయ సంస్కృతిని మరచిపోని ఆ కుటుంబాన్ని పలువురు అభినందిస్తున్నారు.