March 14-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
రైలు ప్రయాణం చేయాలంటే ముందు ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటాము. అయితే కొన్ని సందర్బాలలో టికెట్స్‌ను రద్దు చేసుకుంటాము. అలాంటి సమయంలో టికెట్స్ రద్దు చేసుకున్నందుకు కొంత ఛార్జీలు కట్ చేసుకుని మిగితా మొత్తం రీఫండ్ చేస్తుంది రైల్వే. అయితే ఆ డబ్బులు రీఫండ్ కావడానికి కొంత సమయం పడుతుంది. సాధారణంగా 2-3 రోజులు పడుతుంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
IRCTC: గుడ్‌న్యూస్..ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం.. టికెట్ క్యాన్సిల్ అయితే గంటలో రీఫండ్
రైలు ప్రయాణం చేయాలంటే ముందు ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటాము. అయితే కొన్ని సందర్బాలలో టికెట్స్‌ను రద్దు చేసుకుంటాము. అలాంటి సమయంలో టికెట్స్ రద్దు చేసుకున్నందుకు కొంత ఛార్జీలు కట్ చేసుకుని మిగితా మొత్తం రీఫండ్ చేస్తుంది రైల్వే. అయితే ఆ డబ్బులు రీఫండ్ కావడానికి కొంత సమయం పడుతుంది. సాధారణంగా 2-3 రోజులు పడుతుంది.
Aadhaar: గుడ్‌న్యూస్.. ఆధార్ ఉచిత అప్‌డేట్ కోసం గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..
ఆధార్ కార్డు ఇప్పుడు చాలా ముఖ్యమైన పత్రం. ఇది వ్యక్తిగత గుర్తింపుతో పాటు మన నివాస పత్రంగా కూడా ఉపయోగించవచ్చు. ప్రభుత్వ సౌకర్యాలతో సహా వివిధ సేవలకు ఆధార్ పత్రం సహాయపడుతుంది. ఒక వ్యక్తి బయోమెట్రిక్ డేటా, చిరునామా మొదలైన సమాచారం ఆధార్‌లో నిల్వ చేసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఆధార్‌లోని కొంత సమాచారాన్ని అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది.
Telangana : రేపటి నుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్‌తో సహా తెలంగాణ జిల్లాల్లో రేపటి నుంచి ఒంటిపూట పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం మాత్రం యధావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులకు కూడా కొనసాగుతాయి.
Boiled-Filtered Water: ఫిల్టర్ నీరు - గోరువెచ్చని నీరు.. ఇందులో ఏవి మంచివి
నీరు అంటే ప్రాణం అనే మాట మీరు చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటారు. నీరు లేని జీవితం గురించి ఆలోచించడం కూడా కష్టం. మానవులకు, జంతువులకు, మొక్కల జీవితానికి నీరు చాలా ముఖ్యమైనది. మన జీవితంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నీటిపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా, పర్యావరణ కాలుష్యం, సహజ వనరుల కొరత కారణంగా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందడం కష్టంగా మారింది. పెద్ద సంఖ్యలో ప్రజలు మురికి నీటిని తాగాల్సి వస్తోంది. కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, కామెర్లు, కలరా వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయి. శరీరానికి శుభ్రమైన నీరు చాలా ముఖ్యం.
Gopichand : శ్రీకాంత్ మేనకోడలితో గోపీచంద్ పెళ్లిని.. ఆ నటుడే సెట్ చేశారట..
టాలీవుడ్ మాస్ హీరో గోపీచంద్.. సీనియర్ హీరో శ్రీకాంత్ అక్క కూతురు 'రేష్మ'ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వీరి పెళ్లి ఎలా సెట్ అయ్యింది..? అసలు గోపీచంద్‌కి రేష్మకి ఎలా పరిచయం అయ్యింది..? వీరి పెళ్లిని దగ్గరుండి జరిపించిన ఆ సీనియర్ నటుడు ఎవరు..? ఇలాంటి విషయాలు అన్నిటిని గోపీచంద్ రీసెంట్ గా 'అలీతో సరదాగా' షోలో తెలియజేసారు. గోపీచంద్ నటించిన 'భీమా' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆగిపోయిన ఎవరో కారుని తోస్తూ.. డైరెక్టర్ హరీష్ శంకర్..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ రోడ్డు మీద ఆగిపోయి ఉన్న ఓ కారుని నెడుతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ దర్శకుడు, నిర్మాత కలిసి పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు కలిసి హైదరాబాద్ లో ఓ కారులో ప్రయాణిస్తుండగా.. ఒక చోట ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఉదయం పూట బ్లడ్ షుగర్ ఎక్కువ అవుతుందా? ఇలా చేస్తే కంట్రోల్లో..
డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర పెరగడం వల్ల ఇబ్బందులు తలెత్తుఆయి. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండెపై ప్రభావం ఉంటుంది. కొంతమంది రోగులు ప్రతిరోజూ ఉదయం వారి చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు. అలాంటి వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, మీ అల్పాహారం చాలా ఆరోగ్యకరమైనదిగా ఉండటం చాలా ముఖ్యం. అల్పాహారం మీ షుగర్ స్థాయిని నియంత్రించడమే కాకుండా రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.
సమయం లేదు మిత్రమా.. ఇంకా ఒక రోజు మాత్రమే సమయం
పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన నిషేధం రేపటి నుండి అంటే మార్చి 15 తర్వాత అమలులోకి వస్తుంది. ఈ రోజున ఇలాంటి అనేక మార్పులు జరగబోతున్నాయి. ఇది మీ రోజువారీ జీవితాన్ని మార్చేస్తుంది. aytm గురించి మాట్లాడుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి చివరిలో Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై అనేక పరిమితులను విధించింది. దీనిలో కొత్త డిపాజిట్లు తీసుకోవడంపై తక్షణ నిషేధం ఉంది.
Eagle Squad vs Drones డ్రోన్లను కూల్చేయగల ఈగల్ స్క్వాడ్.. ప్రపంచంలోనే రెండోది
ఏ మాత్రం అనుమతి లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ డ్రోన్స్ ను ఎగరేస్తూ ఉంటారు. ఇక సెక్యూరిటీ పరంగా చాలా ముఖ్యమైన ప్రాంతాల మీద నిఘా పెట్టే ప్రయత్నాలు కూడా కొందరు చేస్తూ ఉంటారు. అలాంటి డ్రోన్లను పట్టేయాలంటే చాలా కష్టమే. అయితే వీటి పని పట్టడానికి డేగలు సిద్ధమయ్యాయి. డ్రోన్ లపై దాడి చేయడానికి ఈగల్ స్క్వాడ్ సిద్ధమైంది. డ్రోన్‌లను కూల్చడానికి డేగలకు శిక్షణ ఇస్తూ వచ్చారు. ఆ ట్రైనింగ్ విజయవంతం అయింది.
Pithapuram : పిఠాపురంలో టీడీపీ క్యాడర్ ఆగ్రహం.. జెండాలు దగ్ధం చేసి
పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడ మాజీఎమ్మెల్యే వర్మ అనుచరులు తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ జెండాలు తగులపెట్టారు. స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలంటూ వారు నినాదాలు చేశారు.