టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
మరోసారి చర్చనీయాంశంగా మారిన బాంబే బ్లడ్ గ్రూప్, Mahesh Babu : రికార్డులతో రికార్డులు సృష్టిస్తున్న మహేష్ బాబు.., Ys Jagan : అదే జగన్ ధీమా... అందుకే ఎడా పెడా మార్చేస్తున్నారట..అక్కడ మాత్రం కష్టమేనట
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
మరోసారి చర్చనీయాంశంగా మారిన బాంబే బ్లడ్ గ్రూప్
సాధారణంగా మనుషుల్లో బ్లడ్ గ్రూపులు ఏ, బి, ఓ... లలో పాజిటివ్ లేదా నెగిటివ్ అయి ఉంటుంది. AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాస్త అరుదైనది. అన్నింటికన్నా అరుదైన బ్లడ్ గ్రూప్ ‘బాంబే బ్లడ్ గ్రూప్’ అని అంటుంటారు. మన దేశంలో 179 మంది మాత్రమే ఈ బ్లడ్ గ్రూపును కలిగి ఉన్నారు. ప్రపంచంలో పదిలక్షల మందిలో నలుగురికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూపు ఉంది.
Mahesh Babu : రికార్డులతో రికార్డులు సృష్టిస్తున్న మహేష్ బాబు..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' టాక్ తో సంబంధం లేకుండా రికార్డు కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది. అయితే ఈ రికార్డులతో మహేష్ బాబు మరో కొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఆ రికార్డులు ఏంటంటే.. రీజనల్ సినిమాలతో మహేష్ బాబు ఇప్పటివరకు ఐదుసార్లు 100 కోట్ల షేర్ ని అందుకొని కొత్త రికార్డుని క్రియేట్ చేశారు.
Ys Jagan : అదే జగన్ ధీమా... అందుకే ఎడా పెడా మార్చేస్తున్నారట..అక్కడ మాత్రం కష్టమేనట
రెండు తెలుగు రాష్ట్రాలూ విడిపోయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోలిక ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రజల ఆలోచన వేరుగా ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం రెండు చోట్ల ఒకటే పరిస్థితి ఉంటుంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈసారి కూడా తనదే అధికారం అన్న ధీమాలో ఉన్నారు.
Revanth Reddy : రేవంత్‌ది మొండి ధైర్యమే... అది కదా లీడర్‌కు కావల్సింది
లీడర్‌కు ఉండాల్సిన లక్షణం ఒక్కటే. దేనికీ భయపడకపోవడం. ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గుపడి తనను తాను తగ్గించుకుని ప్రవర్తించకపోవడం.. భాష సరిగా రాకపోయినా.. తాను చేయగలనన్న మొండి ధైర్యం ఉన్న వాడే అసలైన నాయకుడు అవుతాడు. రేవంత్ రెడ్డిని ప్రశంసించడం కాదు కానీ.. దావోస్ పర్యటనలో రేవంత్ పై అనేక మంది అనేకరకాలుగా ట్రోల్ చేస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.
ఈ నెల 22న హాఫ్ డే హాలిడే..కేంద్ర ప్రభుత్వ ప్రకటన
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న ఆఫ్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికి ఈ సెలవు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రభుత్వం హాఫ్ డే సెలవును ప్రకటించింది.
వింగ్స్ ఇండియా ఎయిర్ షో ప్రారంభం
హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభమయింది. ఈ ప్రదర్శనను గురువారంనాడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలో వైమానిక ప్రదర్శన నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ వైమానిక ప్రదర్శన నిర్వహించనున్నారని నిర్వాహకులు తెలిపారు.
బాలయ్య ఆదేశాలు.. జూనియర్ ఎన్టీఆర్‌కు అవమానం
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు వీధికెక్కాయి. ఈరోజు తెల్లవారు జామునే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కల్యాణ్‌రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులర్పించారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించేందుకు అక్కడకు చేరుకున్నారు.
అసోం చీఫ్ సెక్రటరీగా సిక్కోలు వాసి
అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువాడు నియమితులయ్యారు. అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కోత రవిని ఆ ప్రభుత్వం నియమించింది. కోత రవి సొంత గ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో నియమితులు కావడం పట్ల ఆ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా జిల్లా వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Chiranjeevi : చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించబోతున్నారా..?
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో ఎంత అభిమానం సంపాదించుకున్నారో, తన సేవా కార్యక్రమాలతో అంతకుమించి ప్రజాధారణ పొందారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్ సర్వీస్ అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
Ys Sharmila : 21న పీసీసీ చీఫ్ గా బాధ్యతల స్వీకరణ
వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా ఈ నెల 21న బాధ్యతలను స్వీకరించనున్నారు. 21వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఆంధ్రరత్నభవన్ లో ఆమె పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో ఇటీవల విలీనం చేసిన వైఎస్ షర్మిలను ఆ పార్టీ హైకమాండ్ ఏపీసీసీ చీఫ్ గా నియమించిన సంగతి తెలిసిందే.