టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
Parliament : ఒకే రోజు 78 మంది సభ్యుల సస్పెన్షన్, తెలంగాణ నుండి పోటీ చేయనున్న సోనియా గాంధీ? సర్వేలేనా..! శాసించలేడా..?;
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Parliament : ఒకే రోజు 78 మంది సభ్యుల సస్పెన్షన్ ... సమావేశాలు ముగిసే వరకూ
పార్లమెంటులో ఒక్కరోజే 78 సభ్యులను సస్పెండ్ చేశారు. ఉభయ సభల నుంచి మొత్తం 92 మంది వరకూ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. విపక్ష సభ్యులందరినీ అధికారపక్షం సస్పెండ్ చేసిందనే చెప్పాలి. గత శుక్రవారం 14 మంది ఎంపీలను సస్పెండ్ చేసింది. ఈరోజు 78 మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు.
షాకైన నిజామాబాద్ జిల్లా.. ఆరు హత్యలా!!
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో వీరంతా హత్యకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాట్లారుకు చెందిన మాక్లూర్ ప్రసాద్‌ను అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేశాడు.
తెలంగాణ నుండి పోటీ చేయనున్న సోనియా గాంధీ?
ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది.
మాస్క్ లు పెట్టుకోవాల్సిందే: ప్రభుత్వం సూచన
కేరళలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ ఉన్న కారణంగా కర్ణాటక రాష్ట్రం కూడా అప్రమత్తమైంది. కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు సోమవారం నుండి సీనియర్ సిటిజన్లు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నవారు మాస్కులు ధరించాలని సూచించారు.
సర్వేలేనా..! శాసించలేడా..?
ప్రశాంత్ కిషోర్! భారత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల వ్యూహకర్తగా రాజకీయ పార్టీలను అధికారాన్ని అందించిన వ్యక్తి. 2011లో నరేంద్ర మోదీకి మద్దతుగా మొదలైనా ప్రస్థానం... పుష్కర కాలంలో ఆయనకు సెలబ్రిటీ స్థాయిని అందించింది. పీకే అని పిలుచుకునే ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బిహార్.
Ys Jagan : సెకండ్ లిస్ట్ రెడీ... వాళ్లందరూ ఇక తప్పుకోవాల్సిందేనా?
వరస సమావేశాలతో వైసీపీలో హీట్ పెరిగింది. రెండో దశలో వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పిడికి జగన్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తూర్పు. పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్ భేటీలు జరుగుతున్నాయి.
NIA : ఎన్ఐఏ సోదాలు.. నాలుగు రాష్ట్రాల్లో.. కీలక సమాచారం మేరకు
నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దాడులు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద కుట్ర కోణంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈరోజు ఉదయం నుంచే సోదాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలలో ఈ సోదాలు జరుపుతున్నారు.
Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్లస్, మైనస్‌లు ఇవే..
బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ ని అందుకున్నాడు. ఈ సీజన్ లో దాదాపు అందరూ సినీ మరియు బుల్లితెర పరిశ్రమకి చెందిన వారే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా ఈ సీజన్ కంటెస్టెంట్ గా ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. బిగ్‌బాస్ కి వెళ్లడం తన కల అంటూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు చేసే ప్రశాంత్..
Andhra Pradesh : ఏపీ ఎన్నికలలో సంక్షేమ పథకాలు కీలకం కానున్నాయా? అదే నిజమైతే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. తొంభయి రోజులు మాత్రమే సమయం ఉంది. ఎవరికి వారే ఇప్పుడే గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, సంక్షేమ పథకాలతో నెగ్గడం గ్యారంటీ అని అధికార పార్టీ నేత జగన్ ధీమాగా ఉన్నారు. ఇద్దరికీ ఈ ఎన్నికలు కీలకమే. ఎందుకంటే..
Salaar : సలార్ ట్రైలర్‌లో యశ్..! మీరు గమనించారా..?
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన ప్రధాన పాత్రల్లో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న మూవీ 'సలార్'. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రం పై భారీ హైప్ నెలకుంది. మొదటి భాగం 'సీజ్ ఫైర్'ని డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.