March18-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన తర్వాత ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్లకు మరొక అవకాశం కల్పించింది. కొత్త ఓటు నమోదుకు మరో అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇదే చివరి అవకాశంమని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన ఎన్నికలను జరగనున్నాయి. అయినా ఇప్పటి వరకూ ఓటు నమోదు చేయించుకోని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

Update: 2024-03-18 13:03 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి)

Andhra Pradesh : కొత్త ఓటర్లకు ఏపీలో చివరి అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన తర్వాత ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్లకు మరొక అవకాశం కల్పించింది. కొత్త ఓటు నమోదుకు మరో అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇదే చివరి అవకాశంమని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన ఎన్నికలను జరగనున్నాయి. అయినా ఇప్పటి వరకూ ఓటు నమోదు చేయించుకోని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

Russia : "పవర్" కోసం ఏదైనా చేయాగలవాడే పుతిన్

రష్యా ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. ఆయనకు 88 శాతం ఓట్లు లభించినట్లు ఇప్పటి వరకూ అందుతున్న సమాచారాన్ని బట్టి అందుతుంది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పోలింగ్ నిన్న ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి పుతిన్ అధికారాన్ని అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దానంపై అనర్హత వేటు వేయండి : బీఆర్ఎస్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాదరావును కలిశారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫారం తీసుకుని కారు పార్టీ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు.

Congress : కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారా? అధికార పార్టీకి ఈ అవస్థేంటి సామీ?

కాంగ్రెస్ జాతీయ పార్టీ. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. ఆ పార్టీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నేతలకు కొదవలేదు. ఎక్కడ బట్టినా మాజీ నేతలే.. మాజీ కేంద్ర మంత్రులే.. దశాబ్దాల పాటు కేంద్రంలో అధికారంలో ఉండటంతో అన్ని రాష్ట్రాల నుంచి మంత్రి పదవి చేసి రాజకీయంగా పేరున్న వారు అనేక మంది ఉన్నారు.

Big Breaking : గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆమె రానున్న లోక్‌సభ ఎన్నికల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా ఇందుకు అంగీకరించడంతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారని చెబుతున్నారు.

Kalvakuntla Kavitha : అందుకే కవితను అరెస్ట్ చేశాం.. ఈడీ అధికారిక ప్రకటన

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకే తాము కవితను అరెస్ట్ చేశామని తెలిపారు. కవతితను అరెస్ట్ చేసిన సమయంలో ఆమె బంధువులు ఆటంకం కలిగించారని కూడా పేర్కొన్నారు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. వందల కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్ర కీలకమని పేర్కొన్నారు.

BRS : గులాబీ కండువా కప్పుకున్న ప్రవీణ్ కుమార్

మాజీ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. కొద్దిసేపటి క్రితం ఆయన కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎర్రవెల్లి ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ వద్దకు వెళ్లిన ప్రవీణ్ కుమార్ ను పార్టీ నేతలు సాదరంగా ఆహ్వానించారు. ప్రవీణ్ కుమార్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు.

Revanth Reddy : సోనియా, రాహుల్ తో రేవంత్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి టెన్‌జన్‌పథ్ కు వెళ్లి సోనియాను కలిశారు. అక్కడే ఉన్న రాహుల్ తో కూడా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వందరోజుల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమేమి అమలు చేసిందీ వారికి రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది.

Navodaya : అబ్బ ఎంత జీతమో.. ఊరిస్తున్నాయి.. ఎన్ని ఉద్యోగాలో.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగమంటే చాలు.. ఎవరికి మాత్రం ఇష్టముండదు. అందులోనూ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగమంటే ఆషామాషీ కాదు. ఇక్కడ ఉద్యోగం దొరికితే జీవితం సెటిలయినట్లే. భారీ జీతంతో పాటు ఎన్నో ప్రయోజనాలు. జీతానికి జీతం.. సెలవులకు సెలవులు.. ఒక్కటేమిటి లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి సర్కార్ కొలువు దొరికితే చాలు అని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. దేశంలోని నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. దేశంలో మొత్తం 1,377 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవోదయ విద్యాలయ సమితి అప్లికేషన్లను స్వీకరించనుంది. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది.

Causes of Liver Disease: మీరు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే కాలేయ వ్యాధి బారిన పడినట్లే

కాలేయ వ్యాధుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. భారతదేశంలో గత దశాబ్దంలో కాలేయ వ్యాధి రోగుల సంఖ్య 25 శాతం పెరిగింది. చాలా సందర్భాలలో కాలేయ వ్యాధులు కొవ్వు కాలేయంతో ప్రారంభమవుతాయి, కాని ప్రజలు దానిపై శ్రద్ధ చూపరు. క్రమంగా ఈ వ్యాధి పెరుగుతూనే ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య కొన్ని సంవత్సరాల తర్వాత లివర్ సిర్రోసిస్ దశగా మారుతుంది. ఈ దశలో కాలేయం దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్ కాకుండా కామెర్లు, హెపటైటిస్ కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు కాలేయ వ్యాధికి ప్రధాన కారణం, కాలేయ వ్యాధిని ఎలా నివారించవచ్చో నిపుణుల నుంచి తెలుసుకుందాం.


Tags:    

Similar News