25June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

లోక్‌సభ స్పీకర్ పదవిపై క్లారిటీ వచ్చింది. ఎన్డీఏ తరుపున ఓం బిర్లా నామినేషన్ వేయనున్నారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని భావించి రాజ్‌నాథ్ సింగ్ మల్లికార్జున ఖర్గేను కలసి కోరారు. అయితే స్పీకర్ పోస్టు ఎన్డీయే తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇండియా కూటమికి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంచారు.

Update: 2024-06-25 13:22 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Loksabha Speaker : స్పీకర్ ఎన్నిక అనివార్యమయ్యేటట్లుందిగా?

లోక్‌సభ స్పీకర్ పదవిపై క్లారిటీ వచ్చింది. ఎన్డీఏ తరుపున ఓం బిర్లా నామినేషన్ వేయనున్నారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని భావించి రాజ్‌నాథ్ సింగ్ మల్లికార్జున ఖర్గేను కలసి కోరారు. అయితే స్పీకర్ పోస్టు ఎన్డీయే తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇండియా కూటమికి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంచారు.

Nithish Kumar Reddy : నితీష్ కు పిలుపు... అదృష్టం అంటే నీదే కదా సామీ?

టీ 20 వరల్డ్ కప్ లో మనోళ్లు వరస విజయంతో దూసుకుపోతున్నారు. సెమీ ఫైనల్స్ కు వరస గెలుపులతో చేరిపోయారు. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ ఫ్యాన్స్ కు మరో తీపి కబరు కూడా అందింది. అదే విశాఖ కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డికి జింబాబ్వే పర్యటనలో టీంఇండియాలో చోటు దక్కింది.

Ys Jagan : ఓటమి తర్వాత రాళ్లు పడతాయ్.. పూలు పడవు.. అన్నింటినీ దాటుకుని వెళితేనే?

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయింది. ఈ ఓటమికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. నేతలు కూడా అనేక రీజన్స్ చెబుతున్నారు. గెలిచినప్పుడు గెంతులు వేయడం.. ఓటమి చెందినప్పుడు గేలి చేయడం పరిపాటి. ఓటమి ఎదురయినప్పుడు ఏ నేతకయినా.. అందులోనూ ప్రాంతీయపార్టీల నేతలకు రాళ్లు పడక తప్పవు.

Nara Lokesh : ఒక్క ట్వీట్ తో వారికి సూపర్ న్యూస్ చెప్పేశారుగా

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన తన ట్వీట్ ద్వారా నిరుద్యోగులకు తీపి కబురును అందించారు. త్వరలోనే టెట్ పరీక్ష ఉంటుందని తెలిపారు. టెట్ పరీక్ష నిర్వహించన తర్వాతనే మెగా డీఎస్సీ పరీక్ష ఉంటుందని ఆయన తెలియజేయడంతో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు వరంగా మారబోతుంది.

Breaking : నంద్యాల ఘాట్ రోడ్డులో దారుణం.. మహిళను చంపేసిన చిరుత

నంద్యాల - గిద్దలూరు ఘాట్ రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. ఒక చిరుత షేక్ మెహరున్నీసా అనే మహిళను చంపేసింది. అడవిలోకి కట్టెలకు వెళ్లిన మెహరున్నీసా పచర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షేక్ మెహరున్నీసా మాజీ సర్పంచ్ గా పనిచేశారు.

Breaking : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా

ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రకటించారు. పదవికి రాజీనామా చేయాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. తన ప్రమే‍యం లేకుండా జరగాల్సింది జరిగిందని ఆయన తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను తనకు తెలియకుండా పార్టీలోకి తీసుకోవడంపై జీవన్ రెడ్డి కినుక వహించారు.

Telangana : రెండో రోజు జూడాల సమ్మె.. అవస్థలు పడుతున్న రోగులు

తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె నేడు రెండో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. నిన్న జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జరిపిన చర్చలు అసంతృప్తిగా ముగిశాయి.

Ap Poliitcs : ఆ అపోహలొద్దు భయ్యా...ఏదీ శాశ్వతం కాదు.. ముప్ఫయేళ్లు తానే అనుకున్న జగన్ కు?

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరైనా సరే.. అపజయం కన్నా కొన్ని సార్లు విజయమే ప్రమాదకరంగా మారుతుంది. అహం పెరగకుండా ఉంటే రక్షిస్తుంది. పెరిగితే భక్షిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగకూడదు. అలా అనుకునే మొన్నటి వరకూ అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది.

Aravind Kejrival : కేజ్రీవాల్ కు నో రిలీఫ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు వెలువడింది. అయితే ఆయనకు ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఢిల్లీలిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ఇచ్చిన సంగతి తెలిసిందే.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బంగారాన్ని ఎలా తీసుకొచ్చాడంటే? వీడి తెలవి తెల్లారిపోనూ

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీల్లో ఈరోజు ఉదయం అరవై లక్షల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. ఉదయంఅబుదాబి నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఒక ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.





Tags:    

Similar News