టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టెక్నాలజీ రోజురోజుకు మరింతగా అభివృద్ధి చెందుతోంది. బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ సహాయంతో పలు రకాల పనులను చేసుకునే టెక్నాలజీ వచ్చేసింది. బస్సు టికెట్స్, ట్రైన్ టికెట్స్, సినిమా టికెట్స్ ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల సేవలను ఇంట్లోనే ఉండి పొందవచ్చు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక వాట్సాప్‌లో టికెట్ బుకింగ్.. ఎలాగంటే..
టెక్నాలజీ రోజురోజుకు మరింతగా అభివృద్ధి చెందుతోంది. బయటకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ సహాయంతో పలు రకాల పనులను చేసుకునే టెక్నాలజీ వచ్చేసింది. బస్సు టికెట్స్, ట్రైన్ టికెట్స్, సినిమా టికెట్స్ ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల సేవలను ఇంట్లోనే ఉండి పొందవచ్చు.
జోగిపేటలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు!!
ఆందోలు పెద్ద చెరువు ఒడ్డున గల నాగులకట్టపైనున్న శిల్పాలు వెయ్యేళ్లనాటివని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖమాత్యులు డా. దామోదరం రాజనర్సింహ గారి ఆదేశాలపై శుక్రవారం నాడు ఆయన ఆ శిల్పాలను పరిశీలించారు.
Free Medical Tests: అక్కడ ఫ్రీగా మహిళలకు మెడికల్ టెస్టులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కింగ్ కోఠిలోని కామినేని హాస్పిటల్లో మహిళలకు ఫ్రీగా మెడికల్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. వారం రోజుల పాటు ఉచితంగా టెస్టులు నిర్వహించనున్నామని హాస్పిటల్చైర్మన్ కామినేని సూర్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 నుంచి 15 వరకు అన్ని రకాల టెస్టులు, స్కానింగ్‌లు ఫ్రీగా చేస్తున్నట్లు తెలిపారు. కంప్లీట్ బ్లెడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, గైనకాలజీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ స్కానింగ్ లు చేయనున్నారు. అపాయింట్మెంట్ కోసం 78159 78159 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
AP Elections: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు..? సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
దేశం వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, ఏపీలో జరుగనున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరింత హీట్ పెంచాయి. అయితే ఏపీలో ఎన్నికలు ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కీలక ప్రకటన చేయడంతో అసెంబ్లీ ఎన్నికల తేదీ చర్చనీయాంశంగా మారింది. 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు 2024లో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.
ఇప్పుడు భారతదేశపు 'రూపాయి' ఇండోనేషియాలో కూడా చెల్లుబాటు.. ఆర్బీఐ కీలక ఒప్పందం
భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాలతో రూపాయిల వాణిజ్యాన్ని నిరంతరం ప్రోత్సహిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి చమురును కొనుగోలు చేసిన సందర్భంలో భారతదేశం రూపాయిలలో వర్తకం చేసింది. ముడి చమురును కూడా తగ్గింపుతో కొనుగోలు చేసింది.
ఆ పని నచ్చదంటూ.. వెంటనే అమ్మాయి కాళ్లు మొక్కిన ప్రధాని
శుక్రవారం భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్‌లో పాల్గొన్నారు. పలువురు క్రియేటర్స్ కు ప్రధాని మోదీ అవార్డులను ఇచ్చారు. ఆయన నుండి అవార్డులను అందుకున్న వారిలో జాన్వీ సింగ్ కూడా ఉన్నారు. సాధారణంగా భారత సంస్కృతిలో భాగంగా పెద్దలకు కాళ్లు మొక్కడం సహజమే. అలాగే జాన్వీ సింగ్ కూడా గౌరవ సూచకంగా ప్రధాని పాదాలను తాకింది.
Ram Charan : పాకిస్తాన్ మీడియాలో రామ్ చరణ్ గురించి చర్చ..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ రీచ్ ని సంపాదించుకొని గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఉన్న మీడియా అంతా రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడుతూనే వచ్చారు. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ లో కూడా రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Google AI Courses: ఏఐ గురించి కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారా?
Google AI Courses:ప్రస్తుతం టెక్నాలజీపరంగా ఏఐ గురించి ఎంతగానో చర్చ జరుగుతూ ఉంది. ఉద్యోగాలు కావాలన్నా కూడా ఏఐనే నమ్ముకుంటూ ఉన్నారు. గూగుల్ సంస్థ కూడా కొన్ని కోర్స్ లను ప్రవేశపెట్టింది. Google క్లౌడ్ స్కిల్స్ బూస్ట్‌లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ల కోసం రూపొందించిన పలు కోర్సులు ఉన్నాయి.'లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్' (LLMs) గురించి కూడా ఈ కోర్సుల్లో చెబుతారు.
Gas Cylinder Rate:దేశ ప్రజలకు మహిళా దినోత్సవ కానుక.. సిలిండర్ పై 100 తగ్గింపు
Gas Cylinder Rate:మహిళా దినోత్సవం రోజున మహిళలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని.. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని అన్నారు. నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు.
ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు ఏమిటి?
Protein Side Effects: మన శరీరంలోని కణాల పెరుగుదలకు, మన శరీరం బాగా పనిచేయడానికి ప్రోటీన్ అనేది ఒక ముఖ్యమైన పోషకం. మనం రోజూ వ్యాయామం చేస్తే, కణజాలం, కండరాలను నిర్వహించడానికి మన శరీరానికి అదనపు ప్రోటీన్ అవసరం. కాబట్టి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం .