టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
GNI స్టార్టప్స్ ల్యాబ్ ఇండియాలో, ఒక్క కొడుకు ఉంటే చేతినిండా గాజులు వేసుకోవాలా? జగన్ రాయలసీమ ద్రోహి , ఫెస్టివల్ మూమెంట్..
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
GNI స్టార్టప్స్ ల్యాబ్ ఇండియాలో స్థానం దక్కించుకున్న తెలుగుపోస్ట్
గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్ (Google News Initiative), ఎనీ మైండ్ గ్రూప్ (AnyMind Group), టీ హబ్ భాగస్వామ్యంతో GNI స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా కోసం ఎంపిక చేసిన 10 వార్తల స్టార్టప్‌ల జాబితాను ప్రకటించారు. ఇందులో భాగంగా భారతీయ వార్తా స్టార్టప్‌లు ఆర్థిక, కార్యాచరణ స్థిరత్వాన్ని సాధిస్తాయి.
Bangles : ఒక్క కొడుకు ఉంటే చేతినిండా గాజులు వేసుకోవాలా? పిచ్చ పీక్ కు చేరుకుందిగా?
నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుందన్న సామెత ఊరికే పుట్టలేదు. అబద్ధం ఎంత వేగంగా ప్రచారం పొందుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. పైగా సామాజిక మాధ్యమాలలో తలమునకలయ్యే ఈరోజుల్లో మరింత వేగంగా ఒక తప్పుడు ప్రచారం పాకుతుంది.
Ys Jagan : జగన్ చూపంతా ఢిల్లీ వైపే.. అందుకు రీజన్ ఇదేనట
వైసీపీ అధినేత జగన్ పార్లమెంటు ఎన్నికలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు సీట్లు కూడా అధిక సంఖ్యలో గెలుపొందేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ స్థానాలపైనే కాకుండా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా ఆయన ప్రత్యేకంగా నివేదికలను తెప్పించుకుని గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
Kalki 2898 AD: ఆ సెంటిమెంట్ డేట్‌నే రిలీజ్‌కి ఫిక్స్ చేసుకున్న కల్కి..
ప్రభాస్ ని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'కల్కి 2898 AD'. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుంటే, దీపికా పదుకొనే హీరోయిన్ గా చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటాని ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
పచ్చనికాపురంలో పచ్చడి పెట్టిన చిచ్చు
పచ్చడి పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది. ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు చందన, రమణ ప్రేమించి వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది.
Chandrababu : వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరాం
ఎన్నికలను అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యహరిస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలసి ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ఓటర్ల జాబితాలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయన్నారు.
KTR : కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటేనే డేంజర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉండేకన్నా ప్రతిపక్షంలో ఉంటేనే డేంజర్ అని ఆయన అన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీని ఒక ఆటాడుకుంటారని కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి నెల నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Bangles : ఒక్క కొడుకు ఉంటే చేతినిండా గాజులు వేసుకోవాలా? పిచ్చ పీక్ కు చేరుకుందిగా?
నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుందన్న సామెత ఊరికే పుట్టలేదు. అబద్ధం ఎంత వేగంగా ప్రచారం పొందుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. పైగా సామాజిక మాధ్యమాలలో తలమునకలయ్యే ఈరోజుల్లో మరింత వేగంగా ఒక తప్పుడు ప్రచారం పాకుతుంది.
జగన్ రాయలసీమ ద్రోహి ఆళ్లగడ్డ సభలో చంద్రబాబు
రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. ఆళ్లగడ్డలో జరిగిన రా కదలిరా సభలో ఆయన ప్రసంగించారు
Corona Virus : ఫెస్టివల్ మూమెంట్.. కేసులు చూస్తే మాత్రం మామూలుగా లేవుగా
పండగల సీజన్ లో కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కరోనా వైరస్ కేసులతో పాటు జేఎన్ 1 వేరియంట్ కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో 137 జేఎన్ 1 వేరియంట్ కేసులు కొత్తగా నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ప్రస్తుతుం జేఎన్ 1 వేరియంట్ కేసులు 819 కి పెరిగాయి. దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.