May 3-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
శంషాబాద్ లో చిరుత ను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. చిరుతను బోనులో బంధించారు. గత కొద్ది రోజులుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం జరుగుతుండటంతో ఎయిర్ పోర్టు సిబ్బందితో పాటు చుట్టు పక్కల గ్రామస్థులు కూడా భయపడిపోతున్నారు.;
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
ఆపరేషన్ చిరుత సక్సెస్.. బోనులో చిక్కిన క్రూరమృగం
శంషాబాద్ లో చిరుత ను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. చిరుతను బోనులో బంధించారు. గత కొద్ది రోజులుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం జరుగుతుండటంతో ఎయిర్ పోర్టు సిబ్బందితో పాటు చుట్టు పక్కల గ్రామస్థులు కూడా భయపడిపోతున్నారు.
Amedhi : తొలిసారి గాంధీయేతర కుటుంబం నుంచి పోటీ.. స్మృతి ఇరానీకి చెక్ పెడతారనేనా?
సుదీర్ఘకాలం తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పోటీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అమేధీ, రాయబరేలీ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ కు కంచుకోట వంటివి. అక్కడ కొన్ని దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వారే గెలుస్తూ వస్తున్నారు.
Manifesto : ఇద్దరి మ్యానిఫేస్టోలు విడదలయ్యాయి... అయితే ఎవరి మ్యానిఫేస్టో ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే రెండు ప్రధాన పార్టీల మ్యానిఫేస్టోలు విడుదలయ్యాయి. గత నెల 27వ తేదీన వైసీపీ మ్యానిఫేస్టోను విడుదల చేయగా, 30వ తేదీన టీడీపీ, జనసేన కూటమి మ్యానిఫేస్టో విడుదలయింది. ఈ రెండు మ్యానిఫేస్టలను పరిగణనలోకి తీసుకుంటే ఎవరి మ్యానిఫేస్టోను ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తారు?
Temperatures :: బయటకు వచ్చారో ఇక అంతే.. మాడి మసయిపోతారు.. 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకూ నమోదు అవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడిపోతున్నారు. ఇళ్లలో ఉన్న నిప్పుల కుంపట్లో కూర్చున్నట్లే ఉంది. ఉదయం ఆరు గంటల నుంచే ఉక్కపోత మొదలవుతుంది.
IPL 2024 : మళ్లీ మనోడే ఇరగదీశాడుగా.. నితీష్ కుమార్ రెడ్డి వల్లనేగా ఈ గెలుపు
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు బ్యాటింగ్‌కు దిగితే దానిని ఎవరూ ఆపలేరని మరోసారి నిరూపితమయింది. అందుకే టాస్ గెలిచిన జట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ముందు బ్యాటింగ్ అప్పజెప్పకుండా తామే బ్యాట్ ను అందుకుంటున్నారు. వాళ్లను ఫీల్డింగ్ కు దించుతున్నారు. ఛేజింగ్ లో ఆ జట్టును దెబ్బతీయడం సులువుగా మారుతుందని భావించి గత రెండు మ్యాచ్ లలో అదే చేశాయి.
Pensions : ఏంది సామీ.. ఇలా అయిపోయింది.. పింఛను కొంప కొల్లేరు చేస్తుందా.. ఏంది?
అనుకున్నట్లే అయింది. ఏప్రిల్ నెల పింఛను గ్రామ సచివాలయంలో తీసుకోవాలంటే ఇబ్బండి పడిన వృద్ధులు.. ఈసారి మే నెలలో కూడా అవస్థలు పడుతున్నారు. పింఛను అందుకోవడానికి బ్యాంకులకు వెళ్లాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులు టీడీపీకి దూరం చేస్తాయోమోనన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది.
ఏపీలో ఈ నియోజకవర్గాలే అత్యంత సమస్యాత్మకం.. అందకే అదనపు బలగాలతో...?
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాలను గుర్తించినట్లు ఎన్నికల కమిషనర్ మీనా తెలిపారు. పథ్నాలుగు నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాలుగా గుర్తించి అక్కడ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మీనా తెలిపారు.
హైదరాబాద్ పై మరోసారి ఏపీ నేతల కుట్ర : హరీశ్ రావు
హైదరాబాద్ ను మరోసారి ఉమ్మడి రాజధానిగా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మాత్రమే కాదు కేంద్ర పాలిత ప్రాంతం కూడా చేసే కుట్రను ఏపీ నేతలు చేస్తున్నారని అన్నారు.
Breaking : ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ అవినాష్ రెడ్డి బెయిల్ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసినట్లయింది.
KCR : నేటి నుంచి మళ్లీ ప్రచారంలోకి కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం పై నిషేధం నేటితో ముగిసింది. దీంతో నేటి నుంచి మళ్లీ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సిరిసిల్లలో జరిగిన సభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసీఆర్ ప్రచారంపై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.