బ్రేకింగ్ : చిరుత ఆచూకీ దొరికింది.. హైదరాబాద్ లోనే?

త వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుతపులి ఆచూకీ లభించింది. అయితే అధికారులు పట్టుకునే లోపే తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. చిరుతపులి చిరుత తిరిగి పట్టుకునేందుకు అధికారులు [more]

Update: 2020-05-19 03:47 GMT

త వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుతపులి ఆచూకీ లభించింది. అయితే అధికారులు పట్టుకునే లోపే తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. చిరుతపులి చిరుత తిరిగి పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో చిరుత దోబూచులాడుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు . ముఖ్యంగా గండిపేట చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్‌సాగర్‌ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో చిరుతపులి నీళ్లు తాగుతుండగా వాచ్‌మెన్‌ గమనించారు. ఈ విషయాన్ని అధికారుల చేరవేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు గార్డెన్‌లో కుక్కలను వదిలి చిరుత కోసం గాలింపు మొదలుపెట్టారు. వ్యవసాయ క్షేత్రంలో బోనుతోపాటు, సీసీ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. మే 14న నగర శివారులోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద రోడ్డుపై తిరుగుతూ చిరుతపులి కనిపించింది. అయితే అటవీశాఖ అధికారులు దానికి మత్తు ఇచ్చేలోపే తప్పించుకుంది. రోడు పక్కనే ఉన్న ఫాంహౌస్‌లోకి వెళ్లిన చిరుతపులి, వ్యవసాయ యూనివర్సిటీలోని దట్టమైన పొదల్లోకి తప్పించుకుపోయింది. దీంతో అప్పటి నుంచి అధికారులు చిరుత ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News