ఉత్తర్ ప్రదేశ్ లో లైవ్ ఎన్ కౌంటర్ జరిగింది. మీడియా ప్రతినిధులను ఆహ్వానించి మరీ ఆలీఘర్ పోలీసులు ఇద్దరు క్రిమినల్స్ ను ఎన్ కౌంటర్ చేసి పారేశారు. ఈ ఇద్దరు క్రిమినల్స్ ఆరు మర్డర్ కేసుల్లో నిందితులు. ఇద్దరు క్రిమినల్స్ ఒక పురాతన భవనంలో దాక్కున్నారని తెలుసుకున్న పోలీసులు మీడియాను పిలిచి మరీ ఎన్ కౌంటర్ చేశారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో ఏ ఎన్ కౌంటర్ జరిగినా మీడియాకు తెలిపే చేయాలన్న ఆదేశాలు ఉన్నాయంటున్నారు. లైవ్ లో ఎన్ కౌంటర్ చేసిన తొలి సంఘటనగా దీన్ని పోలీసు శాఖ అభివర్ణిస్తుండగా, మానవ హక్కులు హరించారంటూ సోషల్ మీడియాలో యూపీ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.