ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితులు లేవని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు నిర్వహించే [more]
;
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితులు లేవని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు నిర్వహించే [more]
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితులు లేవని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు నిర్వహించే పరిస్థితులు లేవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయిందని నిపుణులు హెచ్చరిస్తున్నా రన్నారు. ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ లోనూ మార్పులు చేయాలని కోరారు. ఇప్పటికే కరోనా కారణంగా ఏడువేల మంది మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు.